నరేంద్ర మోడీపై బాలీవుడ్ విలన్ వ్యాఖ్యలు
బాలీవుడ్ నటుడు రజా మురాద్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ప్రధానిమంత్రి కావాలని కోరిక ఉన్నవారికి తప్పకుండా విశాల హృదయం కావాలన్నారు. జాతుల వారీగా దేశాన్ని విభజన చేయాలనుకునే వారు ప్రధానమంత్రి కాలేరని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి ఆయన కొన్ని విషయాలు నేర్చుకోవాలని సూచించారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోడీ పేరును మరికొన్ని రోజుల్లో ఖరారు చేయనున్న నేపథ్యంలో రజా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.